
అమెరికా విదేశీ విద్యార్థులకు వీసా జారీ ప్రక్రియను ప్రారంభించింది. కాగా చిన్న మెలిక పెడుతూ విదేశాంగ శాఖ బుధవారం కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. అమెరికాలో చదువుకోవాలనుకునే విదేశీయులు తమ షోషల్ మీడియా ప్రొఫైల్స్ ను బహిర్గతం చేయాల్సి ఉంటుంది. మే నెల చివరిలో విదేశీ విద్యార్థులకు వీసాలు జారీ చేయడాన్ని విదేశాంగ శాఖ తాత్కాలికంగా నిలిపివేసింది. కొత్తగా సోషల్ మీడియా మార్గదర్శకత్వాన్ని తీసుకువచ్చింది. మళ్లీ ఈ నెలలో వీసాల కోసం దరఖాస్తులను తీసుకోవడం ప్రారంభించింది.