మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా ప్రాంతంలో కువారా అనే 11 ఏళ్ల బాలుడు.. తన స్నేహితుడితో కలిసి స్కూల్ నుంచి వచ్చే మార్గ మధ్యలో చిరుత కువారాపై దాడి చేసింది. అయితే చిరుత పంజా బాలుడి బ్యాగుపై పడడంతో పెద్ద ప్రమాదం తప్పింది. తన స్నేహితుడితో కలిసి.. గట్టిగా కేకలు వేస్తూ చిరుతపై రాళ్లు విసిరాడు. వారి కేకలు విన్న గ్రామస్తులు అంతా కలిసి కర్రలు, రాళ్లతో దాడి చేయడంతో చిరుత సమీపంలోని అడవిలోకి పారిపోయింది విద్యార్థి స్వల్ప గాయాలతో బయటపడినట్లు తెలిసింది.

