విజ్ఞాన భారతి ఇంజనీరింగ్ విద్యార్థులు తరగతులను బహిష్కరించి కళాశాల ముందు ధర్నా చేశారు. రంగారెడ్డి జిల్లా, ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధి అవుషాపూర్‌లోని ఈ కళాశాలలో బాలికల హాస్టల్ వార్డ్డెన్ రూప గత కొన్ని రోజులుగా విద్యార్థినుల ప్రైవేటు వీడియోలు, ఫొటోలు తీసి బాలుర చీఫ్ వార్డెన్ సత్యనారాయణకు పంపిస్తున్నట్లు కొందరు విద్యార్థులు గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగిన విద్యార్థులకు నచ్చజెప్పినా వినకపోవడంతో స్పందించిన కళాశాల యాజమాన్యం ఇద్దరిని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించడంతో ధర్నాను విరమించారు.

