కర్ణాటకలోని ఓ వేద పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మానవత్వం మరిచి ప్రవర్తించాడు. చిత్రదుర్గ జిల్లాలోని నాయక్నహట్టిలోని ఓ వేద పాఠశాలలో చదువుతున్న ఓ తొమ్మిదేళ్ల బాలుడు అనుమతి లేకుండా ఇంటికి ఫోన్ చేసి మాట్లాడాడనే కారణంగా ప్రధానోపాధ్యాయుడు వీరేశ్ ఉగ్రరూపం దాల్చాడు. ఆ కుర్రాడిని ఇష్టం వచ్చినట్టు కొట్టాడు. కింద పడేసి కాలితో తన్నాడు. ఆ కుర్రాడు ఏడుస్తున్నా పట్టించుకోకుండా తన ప్రతాపం చూపించాడు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ప్రస్తుతం వీరేశ్ పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది.

