
అంతర్జాతీయ డిగ్రీలు లేదా స్కూలు విద్యార్హతలతో చాలా మంది విద్యార్థులు భారత్‌కు తిరిగివస్తారని, అయితే వాటికి గుర్తింపు పొందడంలో తీవ్ర జాప్యాలు, అవరోధాలు ఎదుర్కొంటారని ఆయన చెప్పారు. ఈ కొత్త నిబంధన స్పష్టతను, కచ్చితమైన అంచనాను, నిష్పాక్షికతను అందచేయగలదని ఆయన వివరించారు. విదేశీ విద్యార్థులు సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఓ ఆన్‌లైన్ పోర్టల్‌ను యూజీసీ ప్రారంభించనున్నది. విద్యా సంబంధ నిపుణులతో కూడిన స్టాండింగ్ కమిటీ ఈ దరఖాస్తులను సమీక్షించి 15 పని దినాలలో తన నిర్ణయాన్ని తెలియచేస్తుంది.