
తమిళనాడులోని కరూర్‌లో తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్ నిర్వహించిన భారీ ర్యాలీలో పెను విషాదం చోటుచేసుకుంది. తొక్కిసలాటలో ఇప్పటివరకు 33 మందికి పైగా మరణించగా, 62 మందికి పైగా గాయపడ్డారు.
ఈ సంఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విషాదకర సంఘటన “తీవ్ర విచారకరం” అని పేర్కొంటూ ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. మోదీతో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సైతం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.