తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి పోటీ చేస్తున్న టీవీకే అధినేత విజయ్ జోసెఫ్ తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. మొత్తం రూ.404.58 కోట్ల విలువైన చరాస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. తన వద్ద బీఎండబ్ల్యూ 530, బీఎండబ్ల్యూ ఐ7, టయోటా లెక్సస్ 350, టయోటా వెల్ఫైర్ వంటి ఖరీదైన కార్లు ఉన్నట్లు పేర్కొన్నారు. మారుతీ సుజుకీ స్విఫ్ట్, టీవీఎస్ ఎక్స్టెల్ సూపర్ కూడా ఉన్నట్లు విజయ్ పేర్కొనడం గమనార్హం భార్య సంగీత పేరు మీద రూ.15 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నట్లు వెల్లడించారు.

