
ఏపీలోని విజయవాడ సమీపంలోని కేతనకొండ ప్రాంతంలో కొత్తగా సైనిక్ స్కూల్ రాబోతున్నది. ఇందులో జూన్ నుంచి 5,6 తరగతులలో అడ్మిషన్లు ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో విజయనగరం జిల్లా కోరుకొండ, చిత్తూరు జిల్లా కలికిరి, నెల్లూరు జిల్లాలో కృష్ణపట్నం సమీపంలో సైనిక్ స్కూళ్లు కొనసాగుతున్నాయి. వీటికి తోడుగా కేతనకొండలో సైనిక్‌స్కూల్ ఏర్పాటు కాబోతున్నది. దీంతో ఏపీలో మొత్తం సైనిక్ స్కూళ్ల సంఖ్య 4కు చేరింది.