హైదరాబాద్లోని టీడీఆర్ కేటాయింపుల్లో భారీ కుంభకోణం జరిగిందని, ఇందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడి హస్తం ఉందని హరీశ్ రావు నేరుగా ఆరోపించారు. ఈ వ్యవహారంపై నిజానిజాలు బయటకు రావాలంటే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. “మీ సోదరుడిపై వచ్చిన ఆరోపణలు తప్పని నిరూపించుకునే ధైర్యం మీకు ఉందా?” అంటూ సీఎంకు సవాల్ విసిరారు. ప్రభుత్వం పారదర్శకంగా ఉంటే విచారణకు ఎందుకు వెనుకాడుతోందని ఆయన ప్రెస్ మీట్ వేదికగా నిలదీశారు.

