
స్పేస్ఎక్స్, టెస్లా సీఈవో ఎలన్ మస్క్ కీలక ప్రకటన చేశారు. వికిపీడియా తరహాలో అంతకంటే మెరుగైన గ్రోకిపీడియా(Grokipedia)ను డెవలప్ చేస్తున్నట్లు తెలిపారు. ఆయన కంపెనీకి చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ xAI ఆ కొత్త ఆన్లైన్ ఎన్సైక్లోపీడియాను డెవలప్ చేస్తున్నది. ఈ ప్లాట్‌ఫామ్‌కు గ్రోక్ టెక్నాలజీ వాడనున్నారు. మనుషులకు ఏఐ ఉపయోగపడే రీతిలో ఉండాలని ఎలన్ మస్క్ ఆశిస్తున్న తరహాలో కొత్త ఇన్సైక్లోపీడియా ఉంటుందని భావిస్తున్నారు.