వికారాబాద్ జిల్లా పరిగి మండలం లక్ష్మీదేవిపల్లి సమీపంలోని సుగుణ స్టీల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఫ్యాక్టరీలోని బట్టి ఒక్కసారిగా పేలడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. ఈ పేలుడు ధాటికి లోపల పనిచేస్తున్న పలువురు కార్మికులకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం అందుతోంది.

