విండోస్ 10 సపోర్ట్ ముగిసిపోతుండటం, కోట్లాది కంప్యూటర్లు విండోస్ 11కు అప్‌గ్రేడ్ లేక ప్రపంచవ్యాప్తంగా పాత పీసీలని పడేయాల్సిన తరుణంలో టెక్ దిగ్గజం గూగుల్ ‘క్రోమ్ ఓఎస్ ఫ్లెక్స్ యూఎస్బీ కిట్’ను పరిచయం చేసింది. దీని ధర కేవలం సుమారు 250 రూపాయలు మాత్రమే. కానీ ఇందులో ఇన్స్టాల్ చేసే ఆపరేటింగ్ సిస్టమ్ మాత్రం పూర్తిగా ఉచితం. పర్యావరణ హితం కోసం ఈ కిట్‌ను మళ్ళీ మళ్ళీ వాడుకునేలా రూపొందించారు. కేవలం ఒక యూఎస్బీ ద్వారా మీ పాత ల్యాప్‌టాప్‌కు సరికొత్త రూపునివ్వవచ్చు.

