యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రిలో ఎన్నికల అధికారుల తీరుతో బీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థి ఓడిపోయారు. వాసాలమర్రిలో బీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థి ఓటు మిస్ అయ్యింది. దీంతో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థికి, కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థికి సమాన ఓట్లు పోలయ్యాయి. దీంతో ఎన్నికల అధికారులు టాస్ వేసి కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిని విజేతగా ప్రకటించారు. అయితే మరుసటి రోజు కౌంటింగ్ రూమ్ కిటికీ వద్ద మిస్సయిన ఓటు లభించింది. అందులో బీఆర్‌ఎస్ అభ్యర్థికి ఓటు పడటం గమనార్హం.

