అహ్మదాబాద్ విమానం ప్రమాదంపై విదేశీ మీడియా తప్పుడు వార్తలపై ఇండియన్ పైలట్ల సంఘం (FIP) అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు ది వాల్ స్ట్రీట్ జర్నల్, రాయిటర్స్కు లీగల్ నోటీసులు పంపింది. తప్పుడు కథనాలు ప్రచారం చేసినందుకు రెండు సంస్థలు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. అధికారికంగా నిర్ధారణ లేకుండా ప్రమాదానికి గల కారణాలపై ఊహాగానాలు చేస్తూ మరణించిన పైలట్లదే తప్పు అని ఏ వార్తనైనా మీడియా సంస్థలు ప్రచారం చేయకూడదని పైలట్ల సంఘం పేర్కొంది.

