పశ్చిమాసియాలో కమ్ముకున్న యుద్ధ మేఘాలు, భారతీయులపై కూడా తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ముఖ్యంగా పవిత్ర రంజాన్ వేళ మక్కాకు వెళ్లిన వేలాది భారతీయుల భక్తులు అక్కడే చిక్కుకుపోయారని సమాచారం. పవిత్ర రంజాన్ మాసంలో ఉమ్రా కోసం వేలాది మంది ముస్లిం భక్తులు మక్కా వెళ్లారు. భారత్ నుంచి వెళ్లిన భక్తులు మక్కా, మదీనాల్లో చిక్కుకుపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనితో రెండో అష్రా కోసం వెళ్లాలనుకున్న భక్తుల ప్రణాళికలు పూర్తిగా తలకిందులు అయ్యాయి.

