పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు.. పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రానికి అత్యధికంగా కేంద్ర నిధులు సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని స్పష్టం చేశారు. రాష్ట్రానికి సంబంధించిన కీలక ప్రాజెక్టులు, అభివృద్ధి అంశాలను పార్లమెంట్‌లో బలంగా ప్రస్తావించాలని చంద్రబాబు సూచించారు. అమరావతి మౌలిక సదుపాయాల అభివృద్ధికి రెండో విడత నిధులు, పోలవరం ప్రాజెక్టును 2027 నాటికి పూర్తి చేసేందుకు కేంద్ర సహకారం, విశాఖ రైల్వే జోన్‌కు నిధులు, వంటి అంశాలపై దృష్టి సారించాలని ఆదేశించారు.

