
వాట్సాప్ తాజాగా తీసుకవచ్చిన “సేఫ్టీ ఓవర్‌వ్యూ (Safety Overview)”అనే ఫీచర్ ను తీసుకవచ్చింది. ఈ ఫీచర్ వినియోగదారునికి తమను ఎవరు గ్రూప్‌లో జోడించారో తెలుసుకోవచ్చు. ఈ ఫీచర్ ముఖ్యంగా కాంటాక్ట్ లిస్ట్‌లో లేని వ్యక్తులు గ్రూప్‌కి జోడిస్తే అప్రమత్తం చేస్తుంది. గ్రూప్ గురించి సమాచారంతో పాటు, సురక్షితంగా ఉండటానికి చిట్కాలు కూడా అందిస్తోంది. అలాగే, గ్రూప్‌లో ఎవరైనా సభ్యుడు మీ కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్నారో లేదో కూడా మీరు చూడగలరు.