గత కొన్ని రోజులుగా వివిధ దేశాల్లోని యూజర్లకు వరుసపెట్టి పాస్వర్డ్ రీసెట్ ఈమెయిల్స్ వెళ్లాయి. ఇన్స్టా మాత్రం ఈ వార్తలను ఖండించింది. తమ యూజర్ల డేటాకు ఎలాంటి ఇబ్బందీ లేదని స్పష్టం చేసింది. అంతా సవ్యంగానే ఉందని వివరణ ఇచ్చింది. ఎక్స్ వేదికగా ఓ ప్రకటన విడుదల చేసింది. చిన్న సాంకేతిక లోపం కారణంగా యూజర్లకు పాస్వర్డ్ రీసెట్ ఈమెయిల్స్ వెళ్లాయని ఇన్స్టాగ్రామ్ ఎక్స్ వేదికగా తెలిపింది. డేటా భద్రతకు ఎలాంటి ముప్పు వాటిల్లలేదని తెలిపింది.

