
ప్రపంచ చదరంగాన్ని భారత యువ గ్రాండ్‌మాస్టర్లు శాసిస్తున్నారు. రమేశ్‌బాబు వైశాలి చరిత్ర సృష్టించింది. ప్రతిష్ఠాత్మక గ్రాండ్ స్విస్ టైటిల్న నిలబెట్టుకున్న తొలి ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పింది. సోమవారం జరిగిన ఫైనల్లో మాజీ వరల్డ్ ఛాంపియన్ టాన్ జొంగ్యీ కు ముచ్చెమటలు పట్టించింది వైశాలి. అసమాన పోరాటంతో మ్యాచ్ డ్రా చేసుకున్న భారత చెస్ క్వీన్.. అత్యధిక పాయింట్లతో టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. వచ్చే ఏడాది జరుగబోయే క్యాండిడేట్స్ టోర్నీకి అర్హత సాధించిందీ చెస్ క్వీన్.