మెగా కుటుంబం నుంచి మరో ఆసక్తికరమైన ప్రాజెక్టు పట్టాలెక్కింది. అన్నయ్య వరుణ్ తేజ్ హీరోగా, చెల్లెలు నిహారిక కొణిదెల నిర్మాతగా సరికొత్త చిత్రం శనివారం (మార్చి 28) హైదరాబాద్‌లో వైభవంగా ప్రారంభమైంది.ఈ చిత్ర ప్రారంభోత్సవ వేడుకకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ముహూర్తపు సన్నివేశానికి ఆయన క్లాప్ కొట్టి చిత్ర యూనిట్‌కు తన ఆశీస్సులు అందజేశారు. నిహారిక తన సొంత బ్యానర్ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పతాకంపై ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

