గోల్డ్ ప్రియులకు బంగారం రేట్లు షాక్ ఇచ్చాయి. మార్నింగ్ ఆరు గంటల నుంచి 24 క్యారెట్ల బంగారం తులంపై రూ.2000పైగా పెరగగా.. వెండి ధర కేజీపై రూ.6000 వరకు పెరిగింది. వెనిజులా సంక్షోభంతో బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి. ఇటీవలే హాల్‌టైం హైకి చేరుకున్న బంగారం ధరలు.. గత రెండ్రోజులుగా కాస్త తగ్గుతూ వచ్చాయి. ప్రపంచ వ్యక్తంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు చెలరేగాయి. ఇవి బంగారం, వెండి, చమురు ధరలపై తీవ్ర ప్రాభావాన్ని చూపాయి.

