
వరంగల్ జాబ్‌మేళాలో 65 ప్రైవేటు కంపెనీలు పాల్గొనగా దాదాపు 23 వేల మందికి పైగా అభ్యర్థులు హాజరైనారు. ఆ స్థాయిలో నిరుద్యోగులు వస్తారని ఊహించని అధికారులు తగిన ఏర్పాట్లు చేయడంలో విఫలమయ్యారు. ప్రభుత్వం స్వయంగా ఏర్పాటుచేసిన జాబ్ మేళా కావడంతో నిరుద్యోగులు పోటెత్తారు. సుమారు 6వేల ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు జరుగుతాయని ప్రచారం చేయడంతో గంపెడు ఆశలతో యువత అక్కడికి చేరుకుంది. కానీ అరకొర ఏర్పాట్ల కారణంగా అక్కడికి వచ్చిన అభ్యర్థులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. క్రౌడ్ ఎక్కువ కావడంతో హోటల్ ఆవరణ కిక్కిరిసిపోయింది.
- 0 Comments
- Warangal District