
మామునూరు ఎయిర్పోర్టు నిర్మాణ పనుల్లో మరో కీలక ముందడుగు పడింది. ఎయిర్పోర్టు భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. దాదాపు రూ.205 కోట్ల నిధులు విడుదల చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
మామునూరు విమానాశ్రయం నిర్మాణానికి భూములిస్తున్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి రూ.కోటి 20లక్షలు ఇచ్చేందుకు నిర్ణయించింది. అలాగే ప్లాట్లకు, ఇళ్లకు సైతం న్యాయమైన పరిహారం చెల్లించేందుకు ప్రతిపాదించడంతో భూ బాధితుల నుంచి సానుకూల స్పందన లభించింది.