రాజస్థాన్ రాయల్స్ (RR) మరియు ముంబై ఇండియన్స్ (MI) మధ్య జరిగిన మ్యాచ్ ప్రపంచ అత్యుత్తమ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా వర్సెస్ 15 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీ మధ్య జరిగిన సమరమే హైలైట్గా నిలిచింది. బుమ్రా వంటి బౌలర్ ఓవర్లో ఏ బ్యాటర్ అయినా ఆచితూచి ఆడాలని చూస్తారు, కానీ వైభవ్ సూర్యవంశీ తన సహజసిద్ధమైన దూకుడును ప్రదర్శించాడు. ఈ పోరులో, వైభవ్ ఏమాత్రం బెరవకుండా బుమ్రా వేసిన తొలి బంతికే లాంగ్-ఆన్ మీదుగా కళ్లు చెదిరే సిక్స్ బాదాడు.

