వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రూ.5 వేల కోట్లతో నిర్మించే నారాయణపేట-మక్తల్-కొడంగల్ ఎత్తిపోతల పథకం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలాగే ఏళ్లుగా ఎదురుచూస్తున్న జూరాల ప్రాజెక్టు దిగువన కృష్ణానదిపై వంతెన నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. వనపర్తి జిల్లా ఆత్మకూరులో 50 పడకల సీహెచ్‌సీని ప్రారంభించారు. మక్తల్, ఆత్మకూరు మున్సిపాలిటీల పరిధిలో దాదాపు రూ.వెయ్యి కోట్లతో చేపట్టే పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. మక్తల్‌లోని పడమటి ఆంజనేయస్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు.

