
హెచ్‌సీయూ కంచ గచ్చిబౌలిలో ప్రశాంతంగా బతికిన మూగజీవాలు నేడు ప్రాణభయంతో పరుగులు తీస్తున్నాయి. చెట్లను, ఆవాసాలను బుల్డోజర్లు నేలమట్టం చేస్తుంటే బెదిరిన జింకలు గమ్యం ఎటో తెలియకుండా పరుగులు తీస్తున్నాయి.
దీంతో వివిధ ప్రాంతాల్లో జింకలు సంచరిస్తూ కనిపిస్తున్నాయి. శుక్రవారం గోపన్‌పల్లి, ఎన్టీఆర్ నగర్‌లో ఓ జింక హృదయవిదారకంగా తిరుగుతూ కనిపించింది. రహదారిపై ఉన్న పలు షాపుల్లోకి వెళ్తూ, బయటకు వస్తూ భయపడుతూ నిపించింది.
ఎన్టీఆర్ నగర్ ప్రధాన రహదారిపై పరుగెత్తగా వీధి కుక్కలు వెంటపడ్డాయి. స్థానికులు జింకను కుక్కల బారినుంచి కాపాడారు.
- 0 Comments
- Hyderabad
- RangaReddy District