
ప్రముఖ వజ్రాల వ్యాపారి మెహుల్ ఛోక్సీని బెల్జియం పోలీసులు అరెస్ట్ చేశారు. భారత సీబీఐ అధికారులు కోరిక మేరకు మెహుల్ ఛోక్సీ బెల్జియం పోలీసులు శనివారం అరెస్ట్ చేసినట్టు తెలిపారు. రూ.13,500 కోట్ల పంజాబ్ నేషనల్ బ్యాంక్ మోసం కేసులో మెహుల్‌పై అభియోగాలు ఉన్న నేపథ్యంలో అతడిని అప్పగించాలని భారత్ కోరింది. ఈ నేపథ్యంలోనే అతడిని అరెస్ట్ చేసినట్టు తెలిసింది. పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం బయటపడటానికి కొద్ది వారాల ముందే మెహుల్ చోక్సీ, అతడి మేనల్లుడు నీరవ్ మోదీలు దేశం దాటిపోయారు.