
వక్ఫ్ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. బిల్ సభలో ప్రవేశ పెట్టిన తర్వాత మొదలైన చర్చ సుదీర్ఘంగా సాగింది. దాదాపు 12 గంటలపాటు ఈ బిల్లుపై చర్చించారు. అర్థరాత్రి దాటిన తర్వాత 12.17నిమిషాలకు ఓటింగ్ జరిగింది. ఓటింగ్ జరిగిన సమయంలో లోక్‌సభలో 390 మంది సభ్యులు ఉన్నారు. వారిలో బిల్‌కు అనుకూలంగా 226మంది ఓటు వేస్తే వ్యతిరేకంగా 163 మంది ఓటు వేశారు. ఒక సభ్యుడు దూరంగా ఉన్నారు.