
రాజ్యసభలో సైతం వక్ఫ్ సవరణ బిల్లు ప్రకంపనలు సృష్టిస్తోంది. ముస్లింలకు ఎలాంటి ప్రమాదం జరగబోదని అధికార పక్షం హామీ ఇస్తే.. రాజ్యాంగంపై దాడిగా ప్రతిపక్షం ఆరోపించింది. రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే అందరి దృష్టిని ఆకర్షించారు. పుష్ప సినిమా డైలాగ్‌తో అధికార పక్షానికి కౌంటర్ ఇచ్చారు. వక్ఫ్ భూమిని ఆక్రమించారంటూ అధికార పార్టీ ఎంపీ చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.