 
		ఐఐటీ మద్రాస్‌కు చెందిన ఒక బృందం విమానం నేరుగా, సజావుగా ల్యాండ్ అయ్యేలా చేసే సాంకేతికతను కనిపెట్టింది. విమానం నేరుగా ల్యాండ్ అయ్యేలా హైబ్రిడ్ రాకెట్ థ్రస్టర్, వర్చువల్ సిమ్యులేషన్ టెక్నాలజీని అనుసంధానించింది.
ప్రపంచవ్యాప్తంగా ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు దీనిని సాధించడానికి కష్టపడుతున్నారు. భారతీయ శాస్త్రవేత్తలు దీనిని సాధించడం గర్వకారణం. నేరుగా టేకాఫ్, ల్యాండ్ చేయగల సాంకేతికత చాలా సంక్లిష్టమైనది IIT మద్రాస్ బృందం ఒక వినూత్న పద్ధతిని అనుసరించడంలో విజయం సాధించింది. ఈ బృందం వారి ప్రయోగాన్ని ఒక అంతర్జాతీయ జర్నల్‌లో ప్రచురించింది.
 
      
 
								 
								