హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హరిపుర్ధార్ ప్రాంతంలో బస్సు లోయలో పడిపోయింది. ఇప్పటి వరకు 8మంది ప్రాణాలు కోల్పోగా, పదుల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో సిర్మౌర్‌లోని సంగ్రా సబ్‌డివిజన్‌లోని హరిపుర్ధర్లో ఒక ప్రైవేట్ బస్సు ఎతైన లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఎనిమిది మంది అక్కడికక్కడే మరణించారు. పదుల సంఖ్యలో ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 54 మంది ప్రయాణికులు ఉన్నారు

