పూణెలోని చకన్ ప్రాంతంలో పికప్ వ్యాను అదుపుతప్పి లోయలోకి పడిపోయింది. పాపల్‌వాడి గ్రామానికి చెందిన పలువురు మహిళలు, చిన్నారులు శ్రావణమాసం సోమవారం సందర్భంగా కుందేశ్వర్ ఆలయానికి బయల్దేరారు. అయితే చకన్ ప్రాంతానికి వచ్చేసరికి వాహనం అదుపుతప్పింది. దీంతో రోడ్డు పక్కన 30 అడుగుల లోతులోకి పడిపోయింది. ఈ ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పుణె ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

