లోక్ సభ, అసెంబ్లీ స్థానాల సంఖ్యను 50శాతం పెంచాలని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన బిల్లును ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ప్రవేశ పెట్టాలని నిర్ణయించుకుంది. సీట్ల పెంపు బిల్లు విషయమై ఇప్పటికే తమ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో చర్చించిన కేంద్రం ప్రతిపక్షాలతో సైతం చర్చించాలని నిర్ణయించింది. కేంద్రం నిర్ణయం మేరకు లోక్ సభ స్థానాల సంఖ్య 543 నుంచి 816కి పెరగనుంది. దేశ వ్యాప్తంగా అసెంబ్లీల స్థానాల సంఖ్య 4,123 నుంచి 6,185 పెరుగనుంది.

