రెండో దశ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టి, చర్చకు, ఓటింగ్‌కు పట్టుబట్టాల్సిన ప్రతిపక్షం రూట్ మార్చింది. ఉదయం సభ ప్రారంభం కాగానే గల్ఫ్ యుద్ధం, చమురు ధరలు, భారతీయుల తరలింపు వంటి అంశాల్ని లేవనెత్తింది. దీనిపై సభలో ప్రతిపక్ష సభ్యులు భారీ ఎత్తున నినాదాలు చేశారు. ఇరాన్ యుద్ధంపై, పెరుగుతున్న చమురు ధరలపై చర్చించాలని, అలాగే ఇరాన్ సహా గల్ఫ్‌లో చిక్కుకున్న భారతీయుల్ని రక్షించాలని కోరుతూ సభలో డిమాండ్ చేశారు.

