మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ (ఎంఎంసీ) స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి అనంత్ అలియాస్ వికాస్ 10 మంది మావోయిస్టులతో కలిసి పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఐదు రాష్ర్టాల్లో ఆయనపై రూ కోటి రివార్డు ఉంది.
జనవరి 1వ తేదీన లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్నామని తాజాగా అనంత్ ఒక లేఖను విడుదల చేశారు. ఆ లేఖ విడుదల చేసిన 24 గంటలు తిరగకముందే ఆయన పోలీసులకు లొంగిపోవడం గమనార్హం.

