లొంగిపోయిన ఇద్దరు పాలస్తీనియన్‌లను ఇజ్రాయెల్ దళాలు కాల్చిచంపడం తీవ్ర వివాదానికి దారితీసింది. తమ దగ్గర ఆయుధాలు లేవన్న సంకేతంతో చేతులెత్తి లొంగిపోయిన తర్వాత వారిని కాల్చి చంపారని, ఇది ‘కోల్డ్ బ్లడ్ హత్య’ అని పాలస్తీనా అధికారులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు అరబ్ టీవీ చానళ్లలో ప్రసారం కావడంతో దుమారం రేగింది. దీనిపై విచారణ జరుపుతున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది.

