
ప్రేక్షకులను సర్ప్రైజ్ చేయడానికి, సినిమాకి క్రేజ్ తీసుకురావడానికి స్పెషల్ అప్పీరియన్సులు, గెస్ట్ రోల్స్, ప్లాన్ చేస్తుంటారు మన ఫిలిం మేకర్స్. వార్నర్ మామా తెలుగు సినిమా ద్వారా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నాడని ప్రకటించడంతో అందరూ బాగా ఎగ్జైట్ అయ్యారు. ఎంతో స్పెషల్ అని టీం అంతా చెబుతూ వచ్చిన ఈ పాత్రకు తగిన స్క్రీన్ స్పేస్ దక్కలేదు. అసలు ఆ పాత్రకు సినిమాలో ప్రాధాన్యత లేదు. ఆ క్యారెక్టర్ ను ఎందుకు పెట్టారన్నది కూడా అర్థం కాలేదనే కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.