
లేహ్ లడఖ్‌లో బుధవారం చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలు ప్రభుత్వాన్ని ఉలిక్కిపడేలా చేశాయి. లేహ్, పరిసర ప్రాంతాల్లో జరిగిన అల్లర్లు, ఆస్తుల ధ్వంసంపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
ఈ పరిస్థితులకు స్థానిక కార్యకర్త నమ్ వాంగ్‌చుక్ ప్రేరేపణే కారణమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆయన “అరబ్ స్ప్రింగ్” ఉద్యమం, నేపాల్ జెన్-జెడ్ ఉద్యమాన్ని ప్రస్తావిస్తూ యువతను రెచ్చగొట్టారని ఆరోపణలు వచ్చాయి. చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై రాజ్యాంగ పరిధిలోనే కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్రం స్పష్టం చేసింది.