పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి పరాకాష్టకు చేరాయి. లెబనాన్‌పై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) ఊహించని స్థాయిలో విరుచుకుపడ్డాయి. కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే లెబనాన్ వ్యాప్తంగా వందకు పైగా లక్ష్యాలపై ఇజ్రాయెల్ వాయుసేన బాంబుల వర్షం కురిపించింది. ఈ ఘోర కలికాలంలో ఇప్పటివరకు 254 మంది ప్రాణాలు కోల్పోగా, వెయ్యి మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు లెబనాన్ వెల్లడించింది.1982 లెబనాన్ యుద్ధం తర్వాత ఆ దేశంపై ఇజ్రాయెల్ చేసిన అతిపెద్ద మరియు అత్యంత విధ్వంసకర దాడి ఇదే కావడం గమనార్హం.

