కేంద్ర పాలిత ప్రాంతం లఢఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) కవీందర్ గుప్తా అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన, అధికారికంగా ప్రకటించారు. లఢఖ్ మూడవ ఎల్జీగా 2025, జూలై 18న బాధ్యతలు చేపట్టిన ఆయన, కేవలం ఎనిమిది నెలల స్వల్ప కాలంలోనే పదవి నుంచి తప్పుకోవడం ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

