క్రికెట్‌ను ప్రాణంగా ప్రేమించి.. అంపైరింగ్ వృత్తిలో విశేషంగా రాణించిన డికీ బిర్డ్ (Dickie Bird) కన్నుమూశాడు. ఇంగ్లండ్‌కు చెందిన ఆయన మంగళవారం తుది శ్వాస విడిచాడు. తనదైన అంపైరింగ్‌తో అభిమానుల మనసులు చూరగొన్న డికీ వృద్ధాప్య సమస్యలతో 92 ఏళ్ల వయసులో మరణించాడు. ఆయన మృతి పట్ల యార్క్‌షైర్ క్రికెట్ క్లబ్ సంతాపం తెలియజేసింది. ఐసీసీ వరల్డ్ కప్ చరిత్రలో చిరస్థాయిగా ఆయన పేరు నిలిచిపోతుంది అని యార్క్‌షైర్ క్లబ్ ఒక ప్రకటనలో తెలిపింది.

