
భారత మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవితం అందరికి ఆదర్శప్రాయమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. విజయవాడలో ఏర్పాటు చేసిన గురుపూజోత్సవంలో ఆయన పాల్గొని ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు అందజేశారు. టీచర్లను జీవితంలో ఎప్పుడూ మరచిపోలేమన్నారు. తాను కూడా టీచర్ కావాల్సిందన్నారు. లెక్చరర్‌గా చేరాలని యూనివర్సిటీ వీసీ తనను కోరారని తెలిపారు. లెక్చరర్‌గా కాదు ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ఆయనకు తెలిపానని చెప్పారు.