ఇరాన్ భీకర దాడికి దిగింది. ఇజ్రాయెల్ న్యూక్లియర్ టౌన్ డిమోనాపై క్షిపణులతో విరుచుకుపడింది. డిమోనా.. ఇజ్రాయెల్ న్యూక్లియర్ టౌన్ గా పేరుంది. లిటిల్ ఇండియాగా పిలుస్తారీ పట్టణాన్ని. ఆ దేశ అణ్వాయుధ కార్యకలాపాలకు ప్రాంతాన్ని గుండెకాయగా భావిస్తారు. నేరుగా ఇరాన్ ఈ టౌన్ పైనే దృష్టి సారించింది. మిస్సైళ్లను సంధించింది. వీటిని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఎందుకు ఇంటర్ సెప్ట్ కాలేకపోయిందనేది సవాలక్ష డాలర్ల ప్రశ్నగా మారింది. అత్యంత శక్తిమంతమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ గల ఇజ్రాయెల్.. ఈ మిస్సైళ్లను పసిగట్టలేకపోయింది. వీటిని అడ్డుకోలేకపోయింది.

