
తొలిసారిగా లిక్కర్ కేసుపై స్పందించారు. తమ ప్రభుత్వంలో లిక్కర్ స్కాం జరిగేందుకు ఆస్కారమే లేదు అని వివరణ ఇచ్చారు. ‘లిక్కర్ అమ్మకాలు పెరిగితే లంచాలు ఇస్తారు,వైసీపీ హయాంలో లిక్కర్ అమ్మకాలు తగ్గాయి, మద్యం తయారీ సంస్థలు నష్టపోయాయి. నష్టపోయినప్పుడు మద్యం సంస్థలు లంచాలు ఎందుకిస్తాయి. మద్యం విక్రయాలు ప్రైవేటుకి ఇస్తే లంచాలు ఇస్తారు. మా హయాంలో ప్రభుత్వమే మద్యం దుకాణాలు నడిపింది’అని వైసీపీ అధినేత వైఎస్ జగన్ తెలిపారు. లిక్కర్ కుంభకోణాలు ఇప్పుడు టీడీపీ చేస్తోంది అని ఆరోపించారు.