మైక్రోసాఫ్ట్‌కు చెందిన ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ ప్లాట్‌ఫామ్ లింక్డ్ఇన్ లేఆఫ్స్ ప్రకటించింది. సుమారుగా 600 ఉద్యోగులను తొలగించనున్నారు. న్యూయార్క్ పోస్ట్ కథనం ప్రకారం, జూలై 13 నుండి అమల్లోకి వచ్చేలా 600 మందికి పైగా ఉద్యోగులను తొలగిస్తున్నట్లు లింక్డ్ఇన్ అధికారికంగా ప్రకటించింది. కాలిఫోర్నియా కార్యాలయంలో సుమారుగా 350 మంది,శాన్ఫ్రాన్సిస్కోలో 100 మంది ఉద్యోగులు, సన్నీవేల్లో 59 మంది, కార్పింటెరియాలో 21 మంది ఉద్యోగులు ఈ లేఆఫ్స్ వల్ల ప్రభావితం కానున్నారు.

