విశాఖ స్టీల్ ప్లాంట్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఏడాదిన్నరలో అనూహ్య ప్రగతి సాధించింది అని సీఎం అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పురోగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షనిర్వహించారు. 2024 సెప్టెంబర్ లో ఎదుర్కొన్న రూ.486 కోట్ల నష్టాల నుంచి గట్టెక్కి 2026 జనవరిలో విశాఖ స్టీల్ ప్లాంట్ రూ.54 కోట్లు లాభం సాధించింది అని సీఎం చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. కేంద్ర ప్రభుత్వ ఇచ్చిన రూ. 11 వేల కోట్ల సాయంతో విశాఖ స్టీల్ నిలదొక్కుకుంది అని సీఎం వెల్లడించారు.

