పవన్ కల్యాణ్ టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ దేఖ్ లేంగే సాలా నెట్టింటిని షేక్ చేస్తోంది. మేకర్స్ మొట్టమొదటి సారి లక్ష మంది ఫ్యాన్స్ ఎంట్రీస్‌తో దేఖ్‌లేంగే సాలా సాంగ్ లిరిక్ షీట్‌ను లాంచ్ చేశారు. దేవీ శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఈ పాటను భాస్కర బట్ల రాయగా.. విశాల్ దడ్‌లానీ పాడాడు.

