
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కు అరుదైన గౌరవం దక్కింది. లండన్ లోని ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఆయన మైనపు విగ్రహాన్ని లాంచ్ చేశారు. భారత కాలమానం ప్రకారం శనివారం (మే10) సాయంత్రం చరణ్ స్వయంగా తన చేతుల మీదుగా తన మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చెర్రీతో పాటుగా ఆయన పెట్ డాగ్ రైమ్ విగహాన్ని కూడా ఏర్పాటు చేసారు. టుస్సాడ్స్ చరిత్రలోనే పెంపుడు కుక్కతో ఓ సెలబ్రిటీ వాక్స్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి అని తెలుస్తోంది.