
డాక్టర్ బిఆర్ అంబేద్కర్, రోహిత్ వేములతో పాటు లక్షలాది మంది ఎదుర్కొన్న వివక్షను ఇతరులు ఎదుర్కొనకుండా ఉండేందుకు తెలంగాణలో ‘రోహిత్ వేముల’ చ ట్టాన్ని తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లేఖ రాశారు. రోహిత్ వేముల, పాయల్ తాడ్వీ, దర్శన్ సోలంకి వంటి మంచి భవిష్యత్ ఉన్న యువకులు కుల వివక్ష కారణంగా అర్ధాంతరంగా తమ జీవితాలను ముగించారని, తెలంగాణలో యువత హత్యలను ఆపేందుకు కొత్త చట్టం తీసుకురావాలని సిఎం రేవంత్ రెడ్డిని ఆ లేఖలో రాహుల్‌గాంధీ పేర్కొన్నారు.