
ప్రపంచంలోనే మొట్టమొదటి వాణిజ్య అంతరిక్ష నిఘా ఉపగ్రహం కార్యకలాపాలు శనివారం ప్రారంభమయ్యాయి. దీనిని స్పేస్ కెమెరా ఫర్ ఆబ్జెక్ట్ ట్రాకింగ్ (ఎస్‌సీఓటీ) అంటారు. ఈ నిఘా ఉపగ్రహం భూ కక్ష్యలో తిరుగుతూ భూమిపై గల 5 సెంటీమీటర్ల వస్తువును సైతం చిత్రీకరించగలదు. భారత స్టార్టప్ ‘దిగంతర’ జనవరి 14న ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ ట్రాన్స్‌పోర్టర్-12 రాకెట్ ద్వారా ప్రయోగించింది. ఈ ఉపగ్రహం తన పనిలో భాగంగా మొదట దక్షిణ అమెరికాలోని బ్యూనస్ ఎయిర్స్ నగరాన్ని చిత్రీకరించింది.